సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ పతాకాలపై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో హీరో సంగీత్శోభన్ కాగడా పట్టుకొని చీకటిలో దేన్నో వెతుకుతూ కనిపిస్తున్నారు.
‘సంగీత్ శోభన్ తొలిసారి సోలో హీరోగా నటిస్తున్న చిత్రమిది. వినోదంతో పాటు సస్పెన్స్ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. కథానాయకుడి అన్వేషణ ఎవరికోసమనేది ఉత్కంఠను పంచుతుంది’ అని మేకర్స్ తెలిపారు. నయన్సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, దర్శకత్వం: మానస శర్మ.