న్యూఢిల్లీ: అల్ ఫలాహ్ వర్సిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్దిఖీని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది ఎర్రకోటకు సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన తర్వాత బయటపడిన అక్రమాలకు సంబంధించి సిద్దిఖీని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారి ఒకరు గురువారం తెలిపారు.
సిద్దిఖీని పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చగా, నాలుగు రోజుల పాటు కస్టడీ విధించింది.