మాస్కో: ఉక్రెయిన్‌తో గత రెండెండ్లుగా రష్యా యుద్ధం చేస్తున్నది. క్షిపణులు, బాంబులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిని క్రెమ్లిన్ శిక్షిస్తూ వస్తున్నది. తాజాగా ఓ 68 ఏండ్ల మహిళా డాక్టర్‌కు ఐదున్నరేండ్ల జైలు శిక్ష విధించింది. డాక్టర్ నడెజ్దా బయనోవా (Dr. Nadezhda Buyanova) పిడియాట్రిషన్‌గా ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తాను చికిత్స అందిస్తున్న ఓ చిన్నారి తల్లి అనస్తాశియా అకిన్షియా మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్లే అతని తండ్రి చనిపోయాడని ఆరోపించింది. యుద్ధ కాంక్షతోనే రష్యన్ సైనికులు కీవ్‌కు లక్ష్యంగా మారారని ఆరోపించింది.
దీంతో అకిన్షియా వీడియో ద్వారా అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బయనోవాను అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. తాజాగా కోర్టు ఆమెకు 5 ఏండ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ సందర్భంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, రష్యా సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని కన్నీటి పర్యంతమైంది. అయితే తన వాదనలు నిజమేనని ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు ఆమెకు శిక్ష విధించింది.
2022, ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. మూడేండ్లు సమీపిస్తున్నా.. ఇరు దేశాల మధ్య ఇప్పటికీ యుద్ధం ముగిలేదు. ఎప్పుడు అగుతుందోనన్న విషయంపై స్పష్టం కూడా లేదు. పరస్పర దాడుల్లో ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.