మాస్కో: యుద్ధం ఎంతటి పెను విషాదాన్ని నింపుతుందో మరోసారి వెల్లడైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేండ్లుగా సాగుతున్నది. ఈ యుద్ధంలో రష్యా ఏం సాధించిందో గానీ.. 5 లక్షల మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జీసీహెచ్‌క్యూ డైరెక్టర్ అన్నే కీస్ట్ బట్లర్ వెల్లడించారు.
రష్యా ఎక్కువగా పబ్లిక్ ప్లేసులు, ప్రాసెసర్లు, పబ్లిక్ వ్యవస్థలు, పౌర సరఫరాలు, ప్రభుత్వ సంస్థలనే టార్గెట్ చేస్తున్నదని ఆమె స్పష్టం చేశారు. దాని వల్ల బ్రిటన్ తో పాటు నాటో దేశాలు హైబ్రిడ్ వార్‌ను ఎదుర్కొంటున్నాయని ఆమె తెలిపారు. ఉక్రెయిన్, రష్యా ఎప్పటికప్పుడు యుద్ధ నష్టాలను అంచనా వేసుకుంటున్నా.. ప్రాణ నష్టాలను దాచిపెడుతూనే ఉన్నాయి. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు చెందిన 55 వేల మంది సైనికులు చనిపోయారు.