మాస్కో, ఏప్రిల్ 20: ముప్పేటదాడులు చేస్తున్నప్పటికీ లొంగిపోకుండా దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ను దారిలోకి తెచ్చుకోవడానికి రష్యా కొత్త ప్రయత్నాన్ని మొదలెట్టింది. ఇందులో భాగంగా తన అమ్ములపొదిలోని అత్యంత శక్తిమంతమైన ‘సర్మాట్’ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి సాయంతో ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా నాశనం చేయవచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. రష్యాతో కయ్యానికి కాలుదువ్వే దేశాలు.. ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, మరియుపోల్పై రష్యా సేనలు దాడులను మరింతగా ఉద్ధృతం చేశాయి. యుద్ధం మొదలైనప్పటినుంచి 50 లక్షల మంది ఉక్రెయిన్ను విడిచి వెళ్లిపోయినట్టు ఐరాసకు చెందిన శరణార్థి సంస్థ తెలిపింది.
‘సర్మాట్’ విశేషాలు