కీవ్, మే 28: ఉక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేయాలని ప్రణాళికలు వేసుకుంటున్న వేళ.. రష్యా తాజాగా అత్యంత శక్తిమంతమైన జిర్కాన్ హైపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష చేపట్టింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
ఇది దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదు. ధ్వని కంటే 5-10 రెట్ల అధిక వేగంతో ప్రయాణించగలదు. బారెంట్స్ సముద్రంలోని అడ్మిరల్ గోర్షోవ్ ఫ్రిగేట్ యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్ వెయ్యి కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా రష్యా చిన్న పట్టణాలను తన అధీనంలోకి తీసుకుంటున్నది.