కీవ్, డిసెంబర్ 2 0 : ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై శుక్రవారం రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మరణించినట్టు రష్యా అధికారులు ప్రకటించారు. అమెరికా తయారీ క్షిపణులతో ఇటీవల తమ దేశంపై ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతీకారంగానే క్షిపణులను ప్రయోగించినట్టు వారు చెప్పారు. రష్యా దాడిలో కీవ్ నగరంలోని 630 నివాస గృహాలు, 16 వైద్య సంస్థలు, 30 పాఠశాలలు దెబ్బతిన్నట్టు అధికారులు చెప్పారు.