న్యూఢిల్లీ, డిసెంబర్ 26: సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా యూరప్‌లోని మరో దేశంపై దాడికి సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. చిన్నదైన మాల్డోవా దేశం ట్రాన్స్నిస్టియా ప్రాంతంలో సైనిక చర్యకు కుట్ర పన్నిందని పుతిన్ నేతృత్వంలోని రష్యా ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలో రష్యా త్వరలోనే ఆ దేశంపై దాడికి దిగే అవకాశం ఉందని అల్ జజీరా వార్తా కథనంలో పేర్కొంది. కాగా, మంగళవారం మాల్డోవా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సందు ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ట్రాన్స్సిస్టియాలో మిలటరీ ఆపరేషన్ జరపాలని యోచిస్తున్నట్టు రష్యా నిఘాసంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడానికి మాల్డోవాను నాటో స్థావరంగా మార్చుకుందని రష్యా విదేశాంగ శాఖ మంత్రి బుధవారం ఆరోపించారు. దీనిని సాకుగా చేసుకుని ఆ చిన్న దేశంపై రష్యా దండెత్తే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రష్యా చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదంటూ మాల్డోవా కొట్టిపారేసింది.