మాస్కో, మార్చి25 : ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడింది. 24 గంటల వ్యవధిలో ఉక్రెయిన్లోని పలు నగరాలపై దాదాపు 1000 డ్రోన్లను ప్రయోగించింది. డ్రోన్ దాడుల్లో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇందుకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.
ఉక్రెయిన్లోని వివిధ నగరాల్లోని నివాస భవనాలు, విద్యుత్తు, రవాణా కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పగటి సమయంలో జరిగిన అతిపెద్ద దాడిగా దీనిని పేర్కొంటున్నారు.