కీవ్/మాస్కో, అక్టోబర్ 23: ఉక్రెయిన్పై శనివారం రాత్రి రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. పశ్చిమాన వోలిన్ నుంచి ఆగ్నేయంలోని జపోరిజియా వరకు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్తు సౌకర్యాలే లక్ష్యంగా రష్యా క్షిపణి దాడులు చేసింది. నైరుతిలోని ట్రాన్స్కార్పతియా నుంచి ఈశాన్య దిశలో వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఖార్కివ్, ఖేర్సన్ వరకు అనేకసార్లు భారీ శబ్దాలు వినిపించాయి. రష్యా ప్రయోగించిన 18 దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్ రక్షణశాఖ అధికారులు కూల్చేసినట్టు సమాచారం. ఈ దాడులతో ఉక్రెయిన్లో కరెంట్ లేకుండా పోయింది.15 లక్షల మంది చీకట్లోనే ఉండిపోయారు. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పంది స్తూ.. రాత్రిపూట రష్యా 36 క్షిపణులతో భారీదాడికి దిగిందని చెప్పారు. ఉక్రేనియన్లను వారి ఇండ్ల నుంచి వెళ్లగొట్టి ఐరోపాకు కొత్తగా శరణార్థుల సంక్షోభాన్ని తెచ్చేలా రష్యా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.