Russia Ukraine War | మాస్కో, ఫిబ్రవరి 23 : ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై సోమవారంతో సరిగ్గా మూడేండ్లు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలే లక్ష్యంగా ఏకబిగిన వరుసగా 267 డ్రోన్ల వర్షం కురిపించింది. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌పై ఈస్థాయిలో రష్యా డ్రోన్ దాడులను చేపట్టడం ఇదే మొదటిసారి. ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 267 డ్రోన్స్‌ను ఉక్రెయిన్‌పై ప్రయోగించిందని, ఇందులో 138 డ్రోన్లను కూల్చివేససినటట్టు ఆ దేశ వైమానిక దళ అధికార ప్రతినిధి యూరీ ఇగ్నత్ చెప్పారు. రష్యా డ్రోన్ దాడుల్లో ఏమేరకు నష్టం వాటిల్లిందన్న వివరాల్ని ఆయన వెల్లడించలేదు.