రష్యా చేస్తోన్న దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 9/11 దాడులతో పాటు, పర్ల్ హార్బర్ దాడులతో పోల్చారు. తమ దేశంపై రష్యా చేస్తున్న దాడులను చూస్తుంటే ఈ రెండు దాడులు గుర్తుకు వస్తున్నాయని జెలెన్స్కీ అన్నారు. 9/11 దాడులు, పర్ల్ హార్బర్లో జరిగిన దాడుల్లాగే.. గత మూడు వారాలుగా రష్యా తమపై దాడులు చేస్తోందని, వీటిని చూస్తుంటే ఆ రెండు దాడులే గుర్తుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యూఎస్ కాంగ్రెస్ జాయింట్ సెషన్లో జెలెన్స్కీ వర్చువల్ గా సంభాషిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. రష్యా చేస్తున్న దాడులు కేవలం తమ నగరాలపైనే కాదని, తమ విలువలు, స్వేచ్ఛ, హక్కులపై దాడి చేసిందని మండిపడ్డారు. ఇవి అత్యంత క్రూరమైన దాడులని జెలెన్స్కీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరస్తుడని అమెరికా ఆరోపించింది. ఆ దేశానికి చెందిన ఎగువ సేనేట్‌లో ఏకపక్షంగా పుతిన్‌పై తీర్మానం చేశారు. సాధారణంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యే సేనేట్‌లో.. పుతిన్ అంశంలో ఏకపక్షంగా తీర్మానాన్ని చేశాయి. రిపబ్లికన్ సేనేటర్ లిండ్సే గ్రహమ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. రెండు పార్టీలకు చెందిన సేనేటర్లు ఆ తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన అమెరికాపై యుద్ధ నేరాల కింద విచారణ చేపట్టాలని ఆ తీర్మానంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కోరారు.