Zelensky | ఉక్రెయిన్‌పై రష్యా వంద డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందని ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం తెలిపారు. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ఆయన తెలిపారు. రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. రష్యా దాడి నేపథ్యంలో డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సహాయం చేయాలని యూరోపియన్ దేశాలను కోరారు. యూరోపియన్ దేశాలకు సమీపంలోని అనేక పశ్చిమ ప్రాంతాల్లో సహా వంద కంటే ఎక్కువ క్షిపణులు, డ్రోన్లతో రష్యా దాడికి పాల్పడిందని పేర్కొన్నారు.
తమ వైమానిక రక్షణతో కలిసి పనిచేస్తే ప్రాణాలను రక్షించడానికి తాము చాలానే చేయగలమని పేర్కొన్నారు. మధ్యప్రాశ్చ్యంలో తరహాలో ఐరోపాలోనూ కలిసి పని చేయాలని.. జీవితానికి ప్రతిచోటా అదే విలువ ఉంటుందన్నారు. అయితే, ఇరాన్‌ను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా భూభాగంలో దాడులు చేసేందుకు కీవ్ ఉపయోగించాలనుకునే లాంగ్ రేంజ్ ఆయుధాల వినియోగంపై ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు.