కీవ్: రష్యా మళ్లీ విరుచుకుపడింది. మూడు రోజుల తేడాలోనే ఇవాళ ఉక్రెయిన్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది. దాదాపు 18 క్రూయిజ్ మిస్సైళ్ల(Cruise Missles)ను రష్యా వదిలినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. పావ్లోరాడ్లో ఉన్న లాజిస్టక్పై హబ్‌ను రష్యా టార్గెట్ చేసింది. ఆ పట్టణంలో జరిగిన దాడి వల్ల 34 మంది గాయపడ్డారు, ఒకరు మృతిచెందారు. డజన్ల సంఖ్యలో అక్కడ ఇండ్లు ధ్వంసం అయ్యాయి.
మిస్సైల్ అటాక్ తర్వాత దేశవ్యాప్తంగా ఎయిర్ అలర్ట్ జారీ చేశారు. 18 క్రూయిజ్ మిస్సైళ్లతో దాడి చేస్తే, దాంట్లో 15 క్షిపణులను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ పేర్కొన్నది. అయితే ఫ్రంట్‌లైన్‌కు 70 మైళ్ల సమీపంలో ఉన్న పావ్లోరాడ్లో భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 19 బహుళ అంతస్తుల బిల్డింగ్లు, 25 ప్రైవేటు ఇండ్లు, ఆరు స్కూళ్లు, అయిదు షాపులు ఆ దాడిలో ధ్వంసం అయ్యాయి.