మాస్కో : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై రష్యా, చైనాలతో దర్యాప్తు జరిపించాలని పాకిస్థాన్ కోరింది. రష్యాకు చెందిన ‘ఆర్ఐఏ నోవాస్తి’ న్యూస్ ఏజెన్సీతో పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, ‘సంక్షోభ సమయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు చాలా సానుకూల పాత్రను పోషిస్తాయి. ఉగ్రదాడిపై ఎవరు చెబుతున్నది నిజమో తేల్చడానికి ఆయా దేశాలతో అంతర్జాతీయ దర్యాప్తును చేపట్టాలి’ అని అన్నారు. పాకిస్థాన్‌కు చైనా మద్దతు భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చైనా పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఫోన్లో మాట్లాడారు. పాక్ సార్వభౌమత్వం, భద్రతా ప్రయోజనాలను కాపాడటంలో చైనా అండగా ఉంటుందని అన్నారు.