కీవ్, మార్చి 9: యేటర్లు నామరూపాల్లేకుండా మారాయి. బండరాళ్లు, శిథిలాల కింద పదుల సంఖ్యలో నవజాత శిశువులు, గర్భిణులు చిక్కుకొన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. దవాఖానపై రష్యా దాడులను ఉక్రెయిన్మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన ఇది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరిట పక్షం రోజులుగా దాడులకు తెగబడుతున్న రష్యా మరింతగా రెచ్చిపోయింది. అప్పుడే పుట్టిన పసికందులు, నిండు గర్భిణులు ఉన్న మరియుపోల్‌లోని ఓ మెటర్నిటీ హాస్పిటల్‌పై బుధవారం బాంబు దాడులతో విరుచుకుపడింది. ఆ దవాఖాన తునాతునకలైంది. ప్రధాన వార్డులు, ఆపరేషన్ థి అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. రష్యా చర్యలను క్రూరత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు.
ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను ఎంతకాలం భరిస్తామంటూ ప్రపంచ దేశాలను ప్రశ్నించారు. తమ గగనతలాన్ని ‘నో ఫ్లై జోన్’గా ప్రకటించాలని పశ్చిమ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ‘ఇప్పటికిప్పుడు మా గగనతలాన్ని మూసేయండి. తద్వారా మరణమృదంగాన్ని ఆపేయండి. మీరు మానవత్వాన్ని కోల్పోయారు’ అంటూ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. రాజధాని కీవ్‌లోని జనావాసాలపైనా పుతిన్ సేనలు క్షిపణులు, రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ మేరకు నగరంలో ధ్వంసమైన పలు భవంతులు, వంతెనల చిత్రాలు మాక్సర్ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్షిపణి దాడులు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి కీవ్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. యుద్ధంలో మరణించిన పౌరులను మరియుపోల్‌లో సామూహికంగా ఖననం చేస్తున్నారు.
నేడు భారత్‌కు ‘సుమీ’ స్టూడెంట్స్
సుమీ నుంచి పోల్తావా చేరుకొన్న 600 మంది భారతీయులు పోలాండ్ నుంచి గురువారం భారత్‌కు ప్రయాణం కానున్నారు. భారత ఎంబసీ రక్షించిన 17 మంది విదేశీయుల్లో ఒక పాకిస్థానీ యువతి కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 21 లక్షల మంది వలస వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ వెల్లడించింది. ఇంకోవైపు, రష్యా స్వాధీనం చేసుకున్న చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం నిర్వహణకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు అందడంలేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. చెర్నోబిల్‌కు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని ఎమర్జెన్సీ జనరేటర్లు బ్యాకప్ పవర్‌ను సరఫరా చేస్తున్నాయని ఉక్రెయిన్ చెప్పింది. పసిపిల్లలని కూడా చూడకుండా పుతిన్ సేనలు చేపడుతున్న దాడులను ‘సామూహిక హననం’గా ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు జెలెన్స్కా అభివర్ణించారు.