న్యూయార్క్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం అమెరికాకు వెళ్లారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది సంవత్సర గ్లోబల్ అవుట్రీచ్ కార్యక్రమం ఈ నెల 29న ప్రముఖ మాడిసన్స్వేర్ గార్డెన్ లో నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఐదు వేల మంది పాల్గొంటారని తెలుస్తున్నది.
ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే అనేక సంస్థలు వ్యతిరేకించగా.. ఇప్పుడు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా విమర్శించారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని, దాన్ని రద్దు చేసే అధికారం నగరానికి ఉందో లేదో తెలియదన్నారు. తన తల్లి ఇప్పటికీ భారత్లోనే ఉందని అన్నారు.