Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
Swadeshi Jagaran Manch: భారత్‌పై బిలియనీర్ ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను స్వదేశీ జాగరణ్ మంచ్ ఖండించింది. భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై బ్యాన్ విధించాలని ఎస్జేఎం జాతీయ కో-కన్వీనర్ అశ్వనీ మహాజన్ డిమాండ్ చేశారు. స్టార్‌లింక్ సేవలతో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు.
న్యూఢిల్లీ: భారత్‌పై బిలియనీర్ ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను స్వదేశీ జాగరణ్ మంచ్(Swadeshi Jagaran Manch) ఖండించింది. భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై బ్యాన్ విధించాలని ఎస్జేఎం జాతీయ కో-కన్వీనర్ అశ్వనీ మహాజన్ డిమాండ్ చేశారు. స్టార్‌లింక్ సేవలతో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందన్నారు.ఇండియాలో కమర్షియల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నది. కానీ భారత వర్గాల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. ఆ అప్లికేషన్‌ను తిరస్కరించలేదు కూడా. జాతీయ భద్రత అంశంలో వివరణ ఇచ్చేందుకు మస్క్ కంపెనీ వ్యతిరేకించిందని, తమకు కావాల్సిన రీతిలో స్టార్‌లింక్ స్పందించడం లేదని ఎస్జేఎం తన ప్రకటనలో పేర్కొన్నది.
ప్రజలను వత్తిడికి గురిచేసి, లైసెన్సు కోసం ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నట్లు మహాజన్ ఆరోపించారు. లేజర్ ఆధారిత శాటిలైట్ లింకుల ద్వారా స్టార్‌లింక్ సంస్థ డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుందని అన్నారు. అయితే ఈ విధానం వల్ల భారతీయ డేటా బైపాస్ కాకుండా ఉండేందుకు ఆ వ్యవస్థలను ఇంకా పరీక్షిస్తున్నారని మహాజన్ తెలిపారు. ప్రభుత్వానికి లోబడే స్టార్‌లింక్ తన సేవల్ని విస్తరించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కానీ స్టార్‌లింక్ మాత్రం ప్రభుత్వ షరతు అంగీకరించడం లేదు. వాళ్లు వాడే టెక్నాలజీకి కూడా అనుమతి లేదని ఎస్జేఎం నేత అన్నారు.
ఉక్రెయిన్, ఇరాన్, రష్యా, చైనా, తైవాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, వెనిజులా, సుడాన్ దేశాల అనుభవం ఆధారంగా స్టార్‌లింక్ సేవలపై భద్రతా భయాందోళనలు కలుగుతున్నట్లు అశ్వనీ మహాజన్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌ను బ్యాన్ చేయండి.. స్వదేశీ జాగరణ్ మంచ్ డిమాండ్
చివరి మజిలీ కోసం తీవ్ర ఇబ్బందులు
Koffee with Karan | నువ్వు ఇంకా వర్జిన్‌గానే ఉన్నావా?.. సల్మాన్‌ను మళ్లీ అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్!
గ్రామీణ రహదారుల వెంట ముళ్లపొదలు.. పొంచి ఉన్న ప్రమాదం!
‘ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటరు నమోదు తప్పనిసరి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

