న్యూయార్క్: చంద్రుడి వైపు దూసుకువెళ్తున్న ఓ రాకెట్ గుట్టు విప్పారు ఖగోళ శాస్త్రవేత్త బిల్ గ్రే. ప్రాజెక్ట్ ప్లూటో సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తున్న ఆయన ఈ రహస్యాన్ని బహిర్గతం చేశారు. చంద్రుడిపైకి వెళ్తున్న రాకెట్.. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ది కాదు అని, అది చైనా ప్రయోగించిన ఛేంజ్5- మిషన్ రాకెట్ అని ఆయన తేల్చారు. చంద్రుడి ఉపరితలం దిశగా దూసుకువెళ్తున్న ఆ రాకెట్‌ను తొలి సారి బిల్ గ్రే గుర్తించారు. ఛేంజ్5-టీ1 లునార్ మిషన్‌కు చెందిన బూస్టర్ చంద్రుడి దిశగా వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. తాము అంచనా వేసిన ప్రాంతానికి సమీపంలో ఆ రాకెట్ బూస్టర్ కూలనున్నట్లు ఆయన వెల్లడించారు. వాస్తవానికి మొదట్లో ఆ రాకెట్ బూస్టర్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెంది ఉంటుందని అనుమానించారు. డీప్ స్పేస్ క్లైమేట్ అబ్జర్వేటరీ శాటిలైట్‌ను 2015లో ప్రయోగించారు. దానికి సంబంధించి టూ స్టేజ్ రాకెట్ చంద్రుడి వైపు వెళ్తున్నట్లు మొదట్లో బిల్ గే అనుమానించాడు. కానీ ఇప్పుడు ఆయన దృఢ నిశ్చయానికి వచ్చారు. అయితే 2014, అక్టోబర్ 23వ తేదీన ప్రయోగించిన ఛేంజ్5-టీ1 మిషన్‌కు చెందిన రాకెట్ చంద్రుడి వైపు దూసుకువెళ్తున్నట్లు గ్రే తెలిపారు.