China Masters | సెమీస్‌లో సాత్విక్ జోడీ .. క్వార్టర్స్‌లోనే కంగుతిన్న శ్రీకాంత్..!
China Masters : చైనా మాస్టర్స్ 2026లో భారత డబుల్స్ ద్వయం అదరగొట్టింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా ఆడిన సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
China Masters : చైనా మాస్టర్స్ 2026లో భారత డబుల్స్ ద్వయం అదరగొట్టింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా ఆడిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన మూడ సెట్ల పోరులో అస్ట్రుప్ – రస్ముసెన్(డెన్మార్క్) జంటను చిత్తు చేసింది సాత్విక్ జోడీ. అయితే.. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) పోరాటం ముగిసింది. అదిరే ఆటతో క్వార్టర్ ఫైనల్ చేరిన అతడు లీ చీక్ యూ(హాంకాంగ్) చేతిలో వరస సెట్లలో వెనకబడి.. ఓటమి పాలయ్యాడు.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 ఈవెంట్లో భారత డబుల్స్ ద్వయం సెమీస్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తొలి సెట్‌ను 21-13తో గెలిచిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జంట.. ఆపైనా మరింత చెలరేగింది. అస్ట్రుప్ – రాస్ముస్సెన్ జంట 16-21తో రెండో సెట్ గెలిచి మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక సెట్లో పంజా విసిరిన భారత ద్వయం 21-18తో మట్టికరిపించింది. డెబ్బై నిమిషాల పోరులో ప్రత్యర్థిని గొప్పగా నిలువరించిన సాత్విక్ జోడీ సెమీస్ బెర్తు దక్కించుకుంది.
YET ANOTHER CHINA MASTERS SEMI FOR SAT-CHI 💪🏽
🏸 In the clash of former number ones, Satwik and Chirag overcome a grueling battle against the Danes to make it to the semis! #SatChi have made it at least to the semis of the tournament every single time since 2019. 🤩… pic.twitter.com/NrYUml86sI
— BAI Media (@BAI_Media) September 4, 2026
పట్టు సడలించి..
ఇదే ఈవెంట్లో పతకంపై ఆశలు రేపిన కిడాంబి శ్రీకాంత్ మాత్రం క్వార్టర్స్‌లో కంగుతిన్నాడు. శుక్రవారం మ్యాచ్ ఆరంభంలో లీ చెక్ యూపై చకచకా రెండు పాయింట్లు సాధించిన అతడు.. ఆపై ఆదే జోరు చూపలేకపోయాడు. అనూహ్యంగా పుంజుకున్న హాంకాంగ్ ప్లేయర్ అద్భుతంగా భారత షట్లర్‌ను నిలువరించాడు. తొలి సెట్‌ను 21-16తో గెలుచుకున్న లీకి.. రెండో సెట్లో శ్రీకాంత్ షాకిస్తూ వరసగా నాలుగు పాయింట్లు సాధించాడు. కానీ, కాసేపటికే ఆధిక్యాన్ని తగ్గించినా.. భారత ఆటగాడు 15-14తో సెట్ సొంతం చేసుకుంటాడనిపించింది.
KIDAMBI SRIKANTH’S CAMPAIGN COMES TO AN END 💔
Kidambi Srikanth bows out after a straight-game defeat to Hong Kong’s Lee Cheuk Yiu, going down 16-21, 16-21.
A tough finish for the Indian shuttler. #ChinaMasters2026 #Badminton #KidambiSrikanth #IndianBadminton pic.twitter.com/TyH9HJS6Z8
— myKhel.com (@mykhelcom) September 4, 2026
కానీ, పట్టువదలని లీ.. 21-16తో సెట్‌నూ, మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. దాంతో, శ్రీకాంత్ వరసగా అతడి చేతిలో నాలోగో ఓటమి చవిచూశాడు. చివరగా 2018 ఇండియా ఓపెన్‌లో లీపై విజయం సాధించాడీ మాజీ వరల్డ్ నంబర్ 1. హాంకాంగ్ షట్లర్ చేతిలో భారత సీనియర్‌కు ఇది వరసగా నాలుగో పరాజయం. మ్యాచ్ పోయినా కాసింత గర్వపడాల్సిన విషయం ఏంటంటే.. గత మూడేళ్లలో ఒక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 ఈవెంట్లో శ్రీకాంత్ క్వార్టర్స్ ఆడడం ఇదే మొదటిసారి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

