Duleep Trophy | ఈస్ట్ జోన్‌తో ఫైనల్.. తిలక్ వర్మ బృందంలో సిరాజ్, పడిక్కల్..!
Duleep Trophy : దేశవాళీ సీజన్ 2025-26 తొలి ట్రోఫీ అయిన దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఫైనల్లో భారత స్టార్లు ఆడనున్నారు. పేసర్ సిరాజ్(Siraj), యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal) ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు.
Duleep Trophy : దేశవాళీ సీజన్ 2025-26 తొలి ట్రోఫీ అయిన దులీప్ ట్రోఫీ (Duleep Trophy) ఫైనల్లో భారత స్టార్లు ఆడనున్నారు. శ్రీలంక పర్యటన ముగియడంతో పేసర్ సిరాజ్(Siraj), యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal) ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. లంకపై మెరిసిన వీరిద్దరూ సౌత్ జోన్ జట్టు తరఫున చెలరేగనున్నారు. సెప్టెంబర్ 6 ఆదివారం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో ఈస్ట్ జోన్‌తో ఫైనల్ జరుగనుంది.
దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ముందే సౌత్ జోన్ జట్టు మరింత పటిష్టంగా మారనుంది. సెమీస్‌లో నార్త్ జోన్‌పై సూపర్ విక్టరీ కొట్టిన సౌత్ బలాన్ని పెంచుతూ.. శ్రీలంకపై సెంచరీలతో చెలరేగిన దేవ్‌దత్ పడిక్కల్, ప్రధాన పేసర్ సిరాజ్‌లు జట్టుతో కలువనున్నారు. శ్రీలంకపై మూడు ఇన్నింగ్స్‌ల్లో పడిక్కల్ రెండు సెంచరీలతో 328 రన్స్ సాధించగా.. సిరాజ్ మాత్రం నాలుగే వికెట్లతో నిరాశపరిచిన విషయం తెలిసిందే.
Devdutt Padikkal and Mohammed Siraj have been included in the South Zone squad for the Duleep Trophy final against East Zone beginning on Sunday https://t.co/z0wGarqJn4 pic.twitter.com/czo6rJgTns
— Cricinfo (@cricinfo) September 4, 2026
ఇప్పటికే కేఎల్ రాహుల్(KL Rahul) కూడా స్క్వాడ్‌లో చేరడంతో.. తిలక్ వర్మ కెప్టెన్సీలోని ఆ టీమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు కానుంది. ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. మరో సెమీస్‌లో నార్త్పై 7 వికెట్ల విజయంతో టైటిల్ పోరుకు సిద్ధమైంది సౌత్. సెప్టెంబర్ 6 ఆదివారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఇరు జట్లు అంతిమపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
సౌత్ జోన్ స్క్వాడ్(అప్డేటెడ్) : కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్, కరుణ్ నాయర్, తిలక్ వర్మ(కెప్టెన్), రికీ భూ(వైస్ కెప్టెన్), నారాయణ్ జగదీశన్, కొడమెల హిమతేజ, షేక్ రషీద్, రవిచంద్రన్ స్మరణ్, అభినవ్ తెజ్రన, సిరాజ్, సీవీ మిలింద్, అమన్ ఖాన్, శ్రేయాస్ గోపాల్, కావూరి సాయితేజ, తనయ్ త్యాగరాజన్, త్రిపురణ విజయ్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

