బీజింగ్ : చైనాలోని హాంగ్ఝౌ సిటీలో ఉన్న ఓ దవాఖాన బ్లడ్ డ్రాయింగ్ రోబోను విజయవంతంగా పరీక్షించింది. ఈ రోబో మనిషి నుంచి రక్తాన్ని సురక్షితంగా తీయగలిగింది. మనిషి నరాలను గుర్తించి, రక్తం తీయడం కోసం కెమెరాలు, సెన్సర్లు, కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించుకుంది.
ఈ రోబో సక్సెస్ రేటు మొదటి ప్రయత్నంలో 94 శాతం ఉన్నట్లు నిపుణులు చెప్పారు. ఈ రోబో ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది.