బీజింగ్: రోడ్డుపై వాహనాల మోత వల్ల బీపీ పెరిగే ప్రమాదం ఉంటుందని చైనా, బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలోనూ ట్రాఫిక్ వల్ల బీపీ పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెప్పినప్పటికీ ఇందుకు ట్రాఫిక్ కారణమా? వాహనాల శబ్దం కారణమా? అన్నది వెల్లడి కాలేదు. తాజాగా బీజింగ్‌లోని పెకింగ్ యూనివర్సిటీ, బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో వాహనాల శబ్దం కారణంగానే బీపీ పెరుగుతుందని గుర్తించారు. 2,40,000 మందిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.