Diwali Celebrations | వెలుగుల పండుగ దీపావళి (Deepavali)ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆదివారం ఎంతో ఘనంగా జరుపుకున్నారు (Diwali Celebrations ). ఇంట్లో దీపాలు వెలిగించి, రాత్రి బాణాసంచా కాల్చి కుటుంబమంతా కలిసి సరదాగా గడిపారు. ఈ పండుగను ప్రజలే కాదు పలువురు దేశాధినేతలు కూడా తమ కుటుంబంతో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. భారత మూలాలున్న బ్రిటన్ ప్రధాని (Uk PM) రిషి సునాక్ (Rishi Sunak) సైతం ఈ పండుగను గ్రాండ్గా జరుపుకున్నారు. యూకేలోని తన అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ (10 Downing Stree)లో భార్య అక్షతా మూర్తి (Akshata Murty), ఇద్దరు కుమార్తెలతో కలిసి దీపాలు వెలిగించారు.
పండుగ సందర్భంగా అక్షతా మూర్తి, ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్క సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోని సునాక్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. కుటుంబంతో కలిసి దీపావళి జరుపుకోవడం తనకు ఓ ప్రత్యేక క్షణం అని చెప్పారు. ఈ సందర్భంగా యూకే సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Rishi Sunak | దీపావళి సందర్భంగా రిషి సునాక్కు ప్రత్యేక బహుమతి అందించిన కేంద్ర విదేశాంగ మంత్రి
Silent Diwali | అక్కడ 22 ఏళ్లుగా నిశ్శబ్ద దీపావళి.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ ఏడు గ్రామాలు
Leopard | పటాకుల శబ్దానికి భయపడిన చిరుత.. 15 గంటల పాటూ ఇంట్లోనే నక్కి