లండన్: పాత బట్టలు, నెరిసిన జుట్టుతో రోడ్డు పక్కన బిక్షం ఎత్తుకొనే వ్యక్తి ఆయన.. ఆయనను చూసినవారెవరూ ఇల్లు ఉన్నదని అనుకోరు. కానీ, లండన్లో డామ్ అనే యాచకుడికి ఏకంగా రూ.5 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది.
దాన్నుంచి నెలకు రూ.1.27 లక్షల ఆదాయం కూడా వస్తున్నది. బిక్ష ద్వారా రోజుకు రూ.17 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదిస్తున్నానని డామ్ చెప్పారు. తనకు కొడుకు పుట్టాక తన తండ్రి ఈ ఇల్లును కొన్నారని వెల్లడించారు.