సోల్నా, డిసెంబర్ 3: లింఫోసైట్లు.. శరీరంలో ఉండే తెల్లరక్తకణాలు. వీటినే రోగనిరోధక కణాలు అని పిలుస్తారు. ఇవి మానవ శరీరంలో ప్రవేశించే అంటువ్యాధులు, ఇతర వైరస్లతో పోరాడేందుకు సహాయపడతాయి. అయితే, వీటికి సంబంధించిన ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు స్వీడన్ పరిశోధకులు.
శరీరంలోని రోగనిరోధక కణాలు పేగులకు చేటు చేస్తున్నట్టు గుర్తించారు. పేగు గాయం తర్వాత వీటి సంఖ్య భారీగా పెరుగుతుందని కరోలిన్సా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తేల్చారు. ఆ సమయంలో ఇవి మంచి కంటే చెడే ఎక్కువగా చేస్తున్నాయని, పేగు గాయాన్ని మానకుండా అడ్డుకుంటున్నాయని కనుగొన్నారు. పేగు వ్యాధి తీవ్రతను పెంచుతున్నట్టు తేల్చారు. పేగు గాయం ఉన్న ప్రాంతంలో లింఫోసైట్స్ పేరుకుపోతాయని తాము గుర్తించినట్టు పేర్కొన్నారు.