వాషింగ్టన్, జనవరి 18: టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ, దానినే తమ దేశ పాలసీగా పాలన సాగిస్తున్న పాకిస్థాన్ వైఖరిపై అమెరికా మండిపడింది. పాకిస్థాన్‌కు ప్రస్తుతం ఉన్న ‘నాటోయేతర పెద్ద మిత్రదేశం’ హోదాను వెంటనే తొలగించాలని ఆ దేశ శాసనకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అమెరికాలోని ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెడుతూ ఆ హోదాను పునరుద్ధరించాలంటే ఇస్లామాబాద్ కొన్ని షరతులను పాటించాల్సిందేనని తెగేసి చెప్పారు. అరిజోనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రతినిధి ఎండీ బిగ్స్ ఈ మేరకు సభలో బిల్లును ప్రవేశపెట్టారు.