ఆస్ట్రేలియా కరెన్సీపై ఎలిజబెత్ ఫొటో తొలగింపు
కరెన్సీ నోటుపై దివంగత క్వీన్ ఎలిజబెత్-2 ఫొటోను తొలగించి కొత్తవి ముద్రించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. ముందుగా 5 డాలర్ల నోటుపై ఆమె ఫొటోను తొలగించి, ఆ స్థానంలో స్వదేశీ సంస్కృతి,
సిడ్నీ, ఫిబ్రవరి 2: కరెన్సీ నోటుపై దివంగత క్వీన్ ఎలిజబెత్-2 ఫొటోను తొలగించి కొత్తవి ముద్రించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. ముందుగా 5 డాలర్ల నోటుపై ఆమె ఫొటోను తొలగించి, ఆ స్థానంలో స్వదేశీ సంస్కృతి, చరిత్ర ప్రతిబింబించేలా, గౌరవించేలా కొత్త డిజైన్ రూపొందించనున్నది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా సెంట్రల్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. ప్రస్తుతం 5 డాలర్ల నోటుపై ఒక వైపు ఎలిజబెత్ రాణి-2 ఫొటో, మరోవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనం ఫొటో ఉంటుంది. ఎలిజబెత్ ఫొటోను మాత్రమే తొలగిస్తామని ఆస్ట్రేలియా పేర్కొన్నది. కొత్త నోటు రూపకల్పనలో స్వదేశీ సమూహాలను సంప్రదిస్తామని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కొత్త నోటు వచ్చే వరకు ప్రస్తుత నోటు చెలామణిలో ఉంటుందని పేర్కొన్నది. రాణి మరణం తర్వాత ఆమె కుమారుడు చార్లెస్ కింగ్ చార్లెస్-3.. బ్రిటన్ బయట ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా 12 కామన్వెల్త్ దేశాలకు అధిపతిగా ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

