నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో త్వరలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. వారికి నగరంలోని యాచకులు కనిపించకుండా అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 30 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
యాచకులు నగరం వీడి స్వస్థలాలకు వెళ్లాలని పోలీసులు అనధికారికంగా ఒత్తిడి చేస్తున్నారు. రెండు నెలల తర్వాత తిరిగి రావాలని, అప్పటివరకు ఎవరైనా యాచకులు నగరంలో కనిపిస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. అయితే, 20 – 30 ఏండ్లు క్రితమే గ్రామాలు వీడి నాగ్‌పూర్‌కు వచ్చామని, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లోకి వెళ్లి ఎలా బతకాలని యాచకులు ప్రశ్నిస్తున్నారు.