Ram Chandra Paudel | నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం
Ram Chandra Paudel | నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హరికృష్ణ కర్కి ఇవాళ 78 ఏండ్ల పౌడెల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఖాట్మండు: నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేశారు. నేపాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ హరికృష్ణ కర్కి ఇవాళ 78 ఏండ్ల పౌడెల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. నేపాల్ అధ్యక్ష కార్యాలయంలోని శీతల్ నివాస్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
నేపాల్ మాజీ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ పదవీకాలం ఈ నెల 12తో ముగిసింది. ఈ నేపథ్యంలో గత గురువారమే నూతన అధ్యక్షుడిగా రామ్‌చంద్ర పౌడెల్‌ను ఎన్నుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 313 మంది ఫెడరల్ పార్లమెంట్ సభ్యులు, 518 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అందులో 214 మంది పార్లమెంట్ సభ్యులు, 352 మంది ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు రామ్‌చంద్ర పౌడెల్‌కు మద్దతుగా ఓటువేశారు. అంటే మొత్తం ఎలక్టోరల్ ఓట్లలో 33,802 ఓట్లు రామ్‌చంద్ర పౌడెల్‌కు లభించగా.. మిగతా 15,518 ఓట్లు ఆయన ప్రత్యర్థి సుభాష్ చంద్ర నెంబాంగ్కు దక్కాయి. దాంతో పౌడెల్ గెలిచినట్లుగా నేపాల్ ఎన్నికల సంఘం ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

