Rafa Jaime: మౌంట్ ఎవరెస్టు ఎక్కిన అంధుడిగా రాఫా జేమి రికార్డు
Rafa Jaime: కంటి చూపు లేని అథ్లెట్ అతను. కానీ మౌంటెనేరింగ్ అంటే ఇష్టం. పర్వతాలను ఎక్కాలన్న జోష్ అతనిలో ఉంది. గుడ్డివాడినన్న భయం లేకుండానే.. మెక్సికోకు చెందిన రఫా జేమి .. చాలా ఈజీగా మౌంట్ ఎవరెస్టును ఎక్కేశాడు.
కాఠ్మాండు: మెక్సికోకు చెందిన అంధుడు రఫా జేమి(Rafa Jaime).. మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాడు. ఎవరెస్టును అధిరోహించిన తొలి గుడ్డి వ్యక్తిగా అతను రికార్డు క్రియేట్ చేశాడు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్ ఎక్స్‌పెడీషన్ డైరెక్టర్ చాంగ్ దవా షెర్పా దీనిపై స్పందిస్తూ తన స్నేహితుడు జెస్మాన్ తమాంగ్‌తో కలిసి రఫా .. ఎవరెస్టును ఎక్కినట్లు తెలిపారు. సెవన్ సమ్మిట్ ట్రెక్స్‌కు చెందిన గైడ్స్ కూడా రఫా జేమితో కలిసి ఎవరెస్టు ఎక్కారు.
స్నేహితుడు ఒమర్ అల్వరేజ్తో కలిసి రఫా మౌంట్ ఎవరెస్టు అధిరోహించాడు. రఫాకు కంటి చూపు లేకున్నా.. పర్వతారోహణలో అతను పట్టుదలను ప్రదర్శించినట్లు చాంగ్ దవా తెలిపారు. ఒమర్, రఫాలు తమ స్నేహంలోని శక్తిని చాటారన్నారు. కోరిక, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే.. సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదని రఫా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

