తప్పిన భారీ ముప్పు.. ఆ రేడియోయాక్టివ్ గుళిక దొరికింది
Radioactive Capsule: పెను ప్రమాదమే తప్పింది. సీసియం 137 రేడియోయాక్టివ్ గుళిక దొరికింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతంలో ఈ క్యాప్సూల్ మిస్సైన విషయం తెలిసిందే.
పెర్త్: అత్యంత ప్రమాదకరమైన అణు ధార్మికతను రిలీజ్ చేసే క్యాప్సూల్‌ను ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు. వారం రోజుల క్రితం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఆ గుళిక ఓ ట్రక్కు నుంచి మిస్సైంది. రియో టింటో మైనింగ్ క్షేత్రం నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమయంలో చిన్నపాటి క్యాప్సూల్ ట్రాన్స్‌పోర్ట్‌లో కనిపించకుండాపోయింది. దీంతో ఆస్ట్రేలియాలో తీవ్ర కలవరం మొదలైంది. ఒకవేళ ఆ గుళిక ఓపెన్ అయి ఉంటే… దాని వల్ల పెను ప్రమాదం జరిగేదని అధికారులు అంచనా వేశారు.
6ఎంఎం చుట్టుకొలత.. 8ఎంఎం పొడుగు ఉన్న ఆ క్యాప్సూల్ లో సీసియం-137 రేడియోయాక్టివ్ పదార్ధం ఉంది. ఆ రేడియోయాక్టివ్ పదార్థం వల్ల చర్మం డ్యామేజ్ కావడం, మండిపోవడం, రేడియేషన్ రుగ్మతలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రేడియేషన్ డిటెక్టార్ల ద్వారా ఆ గుళికను గుర్తించినట్లు ఎమర్జెన్సీ సర్వీసు పేర్కొన్నది. రోడ్డుకు రెండు మీటర్ల దూరంలో ఆ క్యాపూల్స్ ఉన్నట్లు పసికట్టారు.
ఒకవేళ సీసియం క్యాప్సూల్‌కు ఎక్స్పోజ్ అయితే.. అది గంటలో 10 ఎక్సరేలకు సమానమైన రేడియేషన్ విడుదల చేస్తుందని హెల్త్ ఆఫీసర్ ఆండ్రూ రాబర్ట్సన్ తెలిపారు. ట్రక్కులో తీసుకువెళ్తున్న సమయంలో.. ఆ ట్రక్కు బోట్లు ఊడిపోవడం వల్ల.. క్యాప్సూల్ ఉన్న పరికరం కింద పడినట్లు భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

