e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News లీడింగ్‌లో పుతిన్ పార్టీ.. కొన్ని చోట్ల క‌మ్యూనిస్టుల హ‌వా

లీడింగ్‌లో పుతిన్ పార్టీ.. కొన్ని చోట్ల క‌మ్యూనిస్టుల హ‌వా

మాస్కో: ర‌ష్యా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన యునైటెడ్ ర‌ష్యా పార్టీ మ‌ళ్లీ విక్ట‌రీ దిశ‌గా వెళ్తోంది. వాస్త‌వానికి పుతిన్‌కు ప్ర‌జ‌ల్లో స‌పోర్ట్ త‌గ్గినా.. ఆయ‌న పార్టీనే భారీ విజ‌యాన్ని న‌మోదు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ముగిసిన వెంట‌నే .. తామే గెలిచిన‌ట్లు యునైటెడ్ ర‌ష్యా పార్టీ ప్ర‌క‌టించింది. పుతిన్‌ను వ్య‌తిరేకిస్తున్న వారంతా ఈసారి ఎన్నిక‌ల్లో పోటీప‌డలేదు. పోటీలో నిలిచిన అభ్యర్థుల్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాకే వారికి సీట్ల‌ను ఇచ్చారు. బ్యాలెట్ బాక్సుల్లో అక్ర‌మ ఓట్లు పోలైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే పోలింగ్‌లో ఎటువంటి అక్ర‌మాలు చోటుచేసుకోలేద‌ని ర‌ష్యా ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తెలిపింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం 64 శాతం ఓట్లను లెక్క‌బెట్టారు. దాంట్లో యునైటెడ్ ర‌ష్యా పార్టీకి 48 శాతం ఓట్లు పోల‌య్యాయి. ఆ త‌ర్వాత క‌మ్యూనిస్టు పార్టీ ఆఫ్ ర‌ష్యాకు 21 శాతం ఓట్లు ప‌డ్డాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో చాలా స్వ‌చ్ఛంగా, నిజాయితీతో గెలిచిన‌ట్లు యునైటెడ్ ర‌ష్యా పార్టీ పేర్కొన్న‌ది. పుతిన్ పార్టీ నెగ్గినా.. గ‌తంతో పోలిస్తే మెజారిటీ త‌గ్గిన‌ట్లు భావిస్తున్నారు. 2016లో పుతిన్ పార్టీకి 54 శాతం ఓట్లు పోల‌య్యాయి. క‌మ్యూనిస్టుల‌కు కొత్త‌గా 8 శాతం ఓట్లు పెరిగిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అలెక్సీ న‌వాల్నీని జైల్లో వేసిన ఘ‌ట‌న వ‌ల్ల కొంత వ‌ర‌కు పుతిన్‌కు మ‌ద్ద‌తు త‌గ్గిన‌ట్లు భావిస్తున్నారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement