Chicken Shops | రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్
Chicken Shops | తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్ : తెలంగాణలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ రూ.16 కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తంచేశారు.
కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు రేపటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభాలు తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారినట్లు అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. తక్కువ మార్జిన్ వల్ల వ్యాపారుల జీవనోపాధి సవాల్‌గా మారిందని అంటున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీ తీరానికి అర్నబ్ తుపాను ముప్పు.. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక.. సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

