కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారిగా ఉక్రెయిన్ భూభాగంలో పర్యటించారు. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన మరియుపోల్‌లో పుతిన్ ఆకస్మిక పర్యటన చేశారు. హెలీకాప్టర్ ద్వారా మరియుపోల్ వెళ్లిన పుతిన్ అక్కడ స్వయంగా కారు నడుపుతూ పలు ప్రదేశాలు తిరిగారని రష్యా అధికారిక వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఎప్పుడు ఈ పర్యటన జరిగిందనేది మాత్రం బయటపెట్టలేదు. అక్కడ ఆయన స్థానికులతో మాట్లాడుతున్న వీడియోను రష్యా ఛానళ్లు ప్రసారం చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధంలో మరియుపోల్ నగరం తీవ్రంగా నష్టపోయింది. యుద్ధం వల్ల దాదాపు లక్షమంది ప్రజలు ఈ నగరాన్ని వీడి వెళ్లారు.