ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న పుతిన్‌కు ఝలక్ తగిలింది. వ్లాదిమీర్ పుతిన్ సలహాదారు తన పదవికి రాజీనామా చేసేశారు. అనాటోలీ చుబైస్… పుతిన్‌కు అంతర్జాతీయ సంబంధాలపై సలహాదారునిగా కొనసాగుతున్నారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఈయన రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు
. అయితే ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డ్మిత్రీ పేస్కోవ్ పేర్కొన్నారు. అయితే ఈ చుబైస్ అత్యంత ప్రభావ శీలమైన వ్యక్తి మాత్రం కాదని ఓ వాదన కూడా వుంది. భద్రతా పరమైన వ్యవహారాల్లో ఆయనకు చాలా తక్కువ నిపుణత వుందని, పేర్కొంటున్నారు. అయినా… భద్రతా సలహాదారుగా ఉన్న వ్యక్తి రాజీనామా చేయడమనేది కచ్చితంగా సంచలన విషయమే అని కొందరు పేర్కొంటున్నారు.