Israeli Embassy Set On Fire | రఫా మారణకాండపై నిరసనలు.. మెక్సికోలో ఇజ్రాయెల్ ఎంబసికి నిప్పు
Israeli Embassy Set On Fire | పాలస్తీనాలోని రఫాలో ఇజ్రాయెల్ మారణకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెక్సికోలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టారు. బీరు క్యాన్లు చల్లి మంటలు రాజేశారు.
మెక్సికో సిటీ: పాలస్తీనాలోని రఫాలో ఇజ్రాయెల్ మారణకాండపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మెక్సికోలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి నిప్పుపెట్టారు. (Israeli Embassy Set On Fire) బీరు క్యాన్లు చల్లి మంటలు రాజేశారు. నిరసకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ‘రఫా కోసం అత్యవసర చర్య’ పేరుతో ప్రదర్శన చేపట్టారు. సుమారు 200 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ బాంబులు కురిపించి శిబిరాల్లో తల దాచుకున్న ప్రజలను చంపడంపై మండిపడ్డారు. గాజాలో మారణకాండను ఇజ్రాయెల్ నిలిపివేయాలని నినాదాలు చేశారు.
కాగా, దక్షిణ గాజాలో నిరాశ్రయులైన ప్రజల శిబిరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. రెండు బాంబు దాడుల్లో సుమారు 45 మంది ప్రజలు మరణించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. 200 మందికిపైగా గాయపడినట్లు చెప్పారు.
మరోవైపు రఫా క్యాంపుపై ఇజ్రాయెల్ దాడుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. చిన్నారులు, మహిళలకు చెందిన కాలిన మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రఫాలోని శిబిరాల్లో సుమారు 13 లక్షల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు.
Protesters set ablaze the Israeli occupation's embassy in Mexico City with Molotov cocktails in protest of the recent massacres in Rafah and elsewhere across the Gaza Strip. pic.twitter.com/5OeM4NzHI6
— Quds News Network (@QudsNen) May 29, 2024
Carnage in Mexico as rioters set fire to the Israeli Embassy in Mexico City and hurl stones and bricks at police during an ‘Action for Rafah’ event. pic.twitter.com/aVY7bJhntx
— Oli London (@OliLondonTV) May 29, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

