వాషింగ్టన్, మే 4: హొర్ముజ్ జలసంధి వద్ద నెలల తరబడి సరుకులతో చిక్కుకుపోయి ఉన్న నౌకల్లోని సిబ్బందికి మానవతా చర్యగా సహాయం అందించేందుకు ‘ప్రాజెక్టు ఫ్రీడమ్’ను నిర్వహించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ సముద్ర ఆపరేషన్ ద్వారా ఇరాన్ చర్యతో హొర్ముజ్ వద్ద చాలాకాలంగా చిక్కుకుపోయిన నౌకలకు అమెరికా రక్షణగా నిలిచి మార్గదర్శనం చేస్తూ జలసంధిని దాటిస్తుందని చెప్పారు. కాగా, ఇరాన్ యుద్ధం ముగింపునకు చాలా సానుకూల చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హొర్ముజ్ జలసంధిలో అమెరికా చేపట్టే ఎలాంటి చర్యనైనా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన కిందే భావిస్తామని ఇరాన్ ఐఆర్జీసీ హెచ్చరించింది.