జురిచ్: గాలి నుంచి నీటిని గ్రహించి శుద్ధ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే పరికరాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన ఈపీఎఫ్‌ఎల్ సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆకులు సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేసుకునే పద్ధతిని స్ఫూర్తిగా తీసుకొని ఈ పరికరాన్ని రూపొందించారు. దీన్ని సూర్యకాంతిలో పెట్టినప్పుడు గాలి నుంచి నీటిని గ్రహించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్‌ను నిల్వ చేసుకొని కార్లు, ఇళ్లకు ఉపయోగించుకోవచ్చు.