బందర్ సేరి బెగవాన్, జనవరి 11: దక్షిణాసియాలోని బ్రూనై దేశానికి చెందిన యువరాజు అబ్దుల్ మతీన్ ఒక సామాన్యురాలిని మనువాడబోతున్నారు. పదిరోజులపాటు అత్యంత వైభవంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. 32 ఏళ్ల యువరాజు 29 ఏండ్ల యాంగ్ ములియా అనీషా రోస్నాను ఇస్లామిక్ సంప్రదాయంలో వివాహం చేసుకోనున్నారు.
చమురు సంపన్న సామ్రాజ్యంలో తూలతూగుతూ ఒకప్పుడు ఈ గ్రహంలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన సుల్తాన్ హసన్నల్ బొల్కియాకు మతీన్ 10వ సంతానం. పెండ్లి కూతురు ఆయన సలహాదారుల్లోని ఒకరి మనుమరాలు. 1788 గదులున్న ప్యాలెస్లో ఆదివారం జరిగే ఊరేగింపు వేడుకతో వివాహం ముగింపు దశకు చేరుకుంటుంది.