బార్సిలోనా, ఆగస్టు 28: ఒకసారి గుండెపోటు వచ్చిన వృద్ధులకు శుభవార్త. మూడు రకాల ఔషధాలు కలిపి తయారుచేసిన ‘పాలీపిల్’ హృద్రోగులకు సంజీవనిగా పనిచేస్తున్నదని తాజా అధ్యయనంలో తేలింది. పెద్ద వయసు వారిలో మరోసారి గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఈ మందు విజయవంతంగా పనిచేస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయన వివరాలు ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి. ఫండాసియాన్ డీ ఇన్వెస్టిగాసియాన్ హెచ్ఎం హాస్పిటల్స్ పరిశోధకులు 65 ఏండ్లు దాటిన 2,499 మందిపై ఈ ప్రయోగం చేశారు.