ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై రష్యా మీడియా ఓ సంచలన కథనాన్ని వెలువరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్లో లేరని, పోలాండ్ వెళ్లిపోయారని పేర్కొంది. జెలెన్స్కీ దేశం విడిచి వెళ్లిపోయారని, పోలాండ్లో తలదాచుకున్నారని తెలిపింది. అయితే.. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన గానీ, ప్రతిస్పందన గానీ తెలపలేదు.
ఇవే రకమైన ఆరోపణలు రష్యా మీడియా కొన్ని రోజుల క్రితం కూడా చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశంలో లేరని, దేశాన్ని విడిచి వెళ్లిపోయారంటూ పేర్కొంది. దీంతో జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. స్థానికంగా ఉంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. చివరి రోజు వరకూ తాను ఉక్రెయిన్లోనే వుంటానని, ప్రస్తుతం ఉక్రెయిన్లోనే ఉన్నానని ఆ వీడియోలో స్పష్టం చేశారు. తాము రష్యా సేనలను ధైర్యంగా ఎదుర్కొంటామని, వారితో పోరాడతామని ప్రకటించిన విషయం తెలిసిందే.