పారిస్: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్నూను అధ్యక్షుడు మాక్రాన్ నియమించారు. విశ్వాసపరీక్షలో ప్రధాని బేరో ఓటమిపాలవటంతో రక్షణమంత్రిని కొత్త ప్రధానిగా ఎంపికచేశారు. ఏడాది వ్యవధిలో ఫ్రాన్స్‌లో ప్రధానిగా బాధ్యత చేపట్టిన నాలుగో వ్యక్తి లెకోర్నూ.
అంతకుముందు బేరో ప్రతిపాదించిన విశ్వాస పరీక్షలో ఆయనకు వ్యతిరేకంగా 364 ఓట్లు, అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. దీంతో రాజకీయ సంక్షోభం ముదరడంతో దేశాధ్యక్షుడు మాక్రాన్ రెండేండ్లలోపే అయిదో ప్రధానిని వెతకాల్సిన అవసరం ఏర్పడింది.