కాలిఫోర్నియా: జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. సూపర్ ట్యూజ్డే(Super Tuesday) ప్రైమరీ ఎన్నికల్లో ఆ ఇద్దరూ తమ పార్టీ ఓట్లను కొల్లకొట్టేస్తున్నారు. 15 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో.. ఇద్దరూ స్వీప్ చేశారు. మరోసారి ఆ ఇద్దరి మధ్యే దేశాధ్యక్ష పదవికి పోటీ ఉండే ఛాన్సు ఉన్నట్లు తాజా ఫలితాల ద్వారా తెలుస్తోంది.
ప్రస్తుతం సూపర్ ట్యూజ్డే కోసం జరిగిన ఎన్నికల ఓటింగ్ ముగిసింది. తాజా రిపోర్టు ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. సుమారు 14 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఐయోవాలో కూడా తమ పార్టీ తరపున ప్రైమరీ నెగ్గినట్లు తెలుస్తోంది. ఇక మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుమారు 12 రాష్ట్రాల్లో రిపబ్లికన్ నేతగా విజయం సాధించారు. దీంతో నిక్కీ హేలీకి ఆయన గట్టి పోటీగా మారారు. అయితే వెర్మోంట్ రాష్ట్రంలో మాత్రం అనూహ్యంగా నిక్కీ హేలీ ప్రైమరీ రేసులో గెలుపొందారు.
మంగళవారం జరిగే ప్రైమరీ ఎన్నికలను సూపర్ ట్యూజ్డే అంటారు. మార్చి 5వ తేదీన అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ఆ ఎన్నికలు జరిగాయి. అమెరికా అధ్యక్ష అభ్యర్థి కోసం జరిగే ప్రైమరీ ఎన్నికల క్యాలెండర్లో ఓకే రోజు ఎక్కువ రాష్ట్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. దాన్నే సూపర్ ట్యూజ్డే అంటారు. అలబామా, అలస్కా, కాలిఫోర్నియా, కొలరాడో, మెయిన్, మసాచుసెట్స్, మిన్నసొట, నార్త్ కరోలినా, ఓక్లహామా, టెన్నిస్సీ, టెక్సాస్, ఉటాహ్, వెర్మోంట్, వర్జీనియా రాష్ట్రాల్లో ఓటింగ్ జరుగుతుంది.