అణ్వాయుధాలను సిద్ధం చేయాలని పుతిన్ ఆదేశించిన నేపథ్యంలో రష్యా న్యూక్లియర్ బలగాలు అణు జలాంతర్గాములను పరీక్షించే పనిలో పడ్డాయి. అణు జలాంతర్గాములను బారెంట్స్ సముద్ర జలాల్లోకి తరలించారు. ఖండాంతర క్షిపణి వ్యవస్థలను సైబీరియా అడవుల్లో పరీక్షించి సిద్ధం చేశారు. ఉక్రెయిన్ లోపలి నగరాలతో పాటు రష్యా మొదటి నుంచి పోర్టులపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఖెర్సాన్, బెర్డ్యాన్స్ ఓడరేవులను స్వాధీనం చేసుకొన్నది. ఒడెస్సా, మరియూపూల్ స్వాధీనానికి ప్రయత్నిస్తున్నది. తమ అధీనంలోని క్రిమియా మీదుగా నల్ల సముద్రం నుంచి అణు జలాంతర్గాములతో ఉక్రెయిన్పై దాడి చేయాలని రష్యా ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తున్నది.