Watch: కదులుతున్న రైలుపై బైక్‌తో నీళ్లు చిమ్మిన ఆకతాయిలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Pranksters Splash Water On Train | రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ రైలు ఆగడంతో సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు.
ఇస్లామాబాద్: రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. (Pranksters Splash Water On Train ) రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ రైలు ఆగడంతో సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. రైలు పట్టాల సమీపంలో ఉన్న కాలువ వద్ద కొందరు యువకులు ఫ్రాంక్ కోసం ప్రయత్నించారు. రైలు రావడాన్ని గమనించిన వారు బైక్ ద్వారా నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చేష్టలకు సంబరపడ్డారు.
కాగా, రైలు ఇంజిన్‌పై నీరు పడటంతో ప్రమాదకరంగా భావించిన సిబ్బంది రైలును నిలిపారు. సిబ్బందితో పాటు ఆగ్రహించిన కొందరు ప్రయాణికులు రైలు దిగారు. బైక్ ద్వారా రైలుపై నీటిని చిమ్మిన ఆకతాయిలు వారిని చూసి షాకయ్యారు. తప్పించుకునేందుకు పరుగులు తీశారు. అయితే కొందరు ప్రయాణికులు ఆ యువకుల వెంటపడ్డారు. వారిని పట్టుకొని కొట్టారు.
మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. యువకులు రైలుపై నీటిని చిమ్మిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిని రైలులోకి ఎక్కించారు. కొంతసేపటి తర్వాత ఆ రైలు అక్కడి నుంచి కదిలింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ان لوگوں کو لگ رھا تھا ٹرین رکے گی نہیں،ٹرین رکی،مسافروں نے طبیعت صاف کرکے ان کو دھویا اور پولیس نے بائیک بھی ضبط کرلی۔لیکن ان ذلیل لوگوں کو گرفتار کیا جانا چاھئے تھا۔ pic.twitter.com/sGCbbjugVL
— صحرانورد (@Aadiiroy2) June 25, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

