టోక్యో: జపాన్‌లో ఇవాళ శక్తివంతమైన భూకంపం(Japan Earthquake) నమోదు అయ్యింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 7.4గా ఉంది. దీంతో జపాన్ వాతావరణ శాఖ సునామీ వార్నింగ్ జారీ చేసింది. సుమారు మూడు మీటర్ల ఎత్తుతో సముద్ర అలలు ఎగిసిపడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నది. ఉత్తరంలోని ఇవాటే రాష్ట్ర సమీప జలాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు భావిస్తున్నారు. చాలా శక్తివంతంగా భూమి కంపించడంతో.. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టోక్యోలో కూడా బిల్డింగ్లు షేక్ అయినట్లు తెలుస్తోంది. ఉత్తర తీరానికి సుమానీ అలలు చేరుకునే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ ఏజెన్సీ పేర్కొన్నది. కోస్టల్ ప్రాంతాలను నుంచి తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. సునామీ అలల వల్ల డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉన్నట్లు చెప్పారు. హెచ్చరికను వెనక్కి తీసుకునే వరకు ఎవరూ తీరానికి వెళ్లకూడదని ప్రభుత్వం పేర్కొన్నది. క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.