వియెన్నా: ఆస్ట్రియాలో కళ, ఇంజినీరింగ్ పర్యావరణాల సమ్మేళనంతో విద్యుత్తు లైన్లను నిర్మిస్తున్నారు. కొంగ, దుప్పి వంటి జంతువుల ఆకారంలో తీర్చిదిద్దుతున్నారు. వీటిని ఆస్ట్రియన్ పవర్ జెయింట్స్ అని పిలుస్తున్నారు.
ఇవి సంప్రదాయ, పారిశ్రామిక పద్ధతిలో కనిపించే పైలాన్లకు బదులుగా, ఆకర్షణీయంగా, ప్రకృతి ప్రేరణతో చిత్రీకరించిన శిల్పాల మాదిరిగా ఉంటాయి.