వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) అనారోగ్యానికి గురయ్యారు. గతకొంతకాలంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండతున్న ఆయన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో (respiratory infection) దవాఖాలో చేరారు. దీంతో రోమ్‌లోని దవాఖానలో (Rome hospital) ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కోవిడ్‌కు సంబంధించినది కాదని వైద్యులు పరీక్షల్లో నిర్ధారించారు. కొన్ని రోజులపాటు దవాఖానలోనే చికిత్స తీసుకుంటారని వైద్యులు తెలిపారు. 86 ఏళ్ల పోప్‌కు కరోనా లేదని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ వెల్లడించారు.
పోప్ ఫ్రాన్సిస్ గతంలో కూడా 10 రోజులపాటు గెమెల్లీ దవాఖానలో చికిత్స పొందారు. 2021 జులైలో ఆయనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు పెద్ద పేగులో 13 ఇంచులు తొలగించారు. కాగా, ఈస్టర్ నేపథ్యంలో ఈ ఆదివారం నుంచి ప్రారంభంకానున్న హోలీ వీక్ వేడుకల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.