Space Walk |వాషింగ్టన్: స్పేస్ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ వ్యోమగామి బృందం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్‌వాక్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మ్యాన్ మొదట నడవగా ఆ తర్వాత స్పేస్ఎక్స్ ఇంజినీర్ సరహ్ గిల్లిస్ ఆయనను అనుసరించారు. అంతరిక్ష నడకను కేవలం 30 నిమిషాల పాటు నిర్వహించారు. కానీ దీనికి సిద్ధం కావడానికి రెండు గంటలు పట్టింది. ఈ కార్యక్రమంలో కొత్త అంతరిక్ష దుస్తులను పరీక్షించారు. ఐసాక్‌మ్యాన్ అంతరిక్షంలో ఉన్న ఫొటోను స్పేస్ఎక్స్ సీఈవో మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టేకాఫ్ అయిన 15 గంటల తర్వాత 1400.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని పొలారిస్ డాన్ మిషన్ అరుదైన మైలురాయిని సాధించింది.
కొవిడ్ 19 వైరస్ పుట్టుకకు ప్రధాన కేంద్రంగా ఉన్న చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటివరకు పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌లతోపాటు, భవిష్యత్తులో వచ్చే వేరియెంట్స్ అన్నింటినీ ఎదుర్కొనే నానో వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు ‘వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ సైంటిస్టులు తాజాగా ప్రకటించారు. ఈమేరకు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ కథనం పేర్కొన్నది. దీని ప్రకారం, ప్రస్తుతం ఎన్నో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా, ఇవి సార్వత్రిక రక్షణ కల్పించలేవు. దీంతో ‘నానో వ్యాక్సిన్’ను తయారుచేసినట్టు సైంటిస్టుల బృందం తెలిపింది. గబ్బిలాలు, ఇతర జంతువులపై పరిశోధనలు జరుపుతున్న ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని గతంలో పలు దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి.